'అజ్ఞాతవాసి' అన్నీ సంచలనాలే
త్రివిక్రమ్ శ్రీనివాస్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ముందు నుండీ ఈ సినిమాకి ఇదే టైటిల్ ప్రచారంలో ఉంది. అలాగే ఆ టైటిల్‌నే ఖరారు చేసింది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాతో పవన్‌లో చాలా మార్పులు వచ్చాయనే చెప్పాలి. ఇంతవరకూ పవన్ పేరుతో ఒకే ఒక ట్విట్టర్ అకౌంట్ ఉండేది. 'జనసేన' పార్టీ కార్యకలాపాలు, ఇతర రాజకీయ వ్యవహారాల గురించి మాత్రమే ఈ ట్విట్టర్‌లో ప్రస్థావించేవారు పవన్ కళ్యాణ్. సినిమాల గురించి ఈ అకౌంట్‌లో ఎప్పుడూ స్పందించలేదు. అయితే తాజాగా పవన్ రెండో ట్విట్టర్ అకౌంట్‌ని తెరిచారు. అందులో అంతా ఓన్లీ సినిమా ఇన్‌ఫర్మేషన్ ఇవ్వనున్నారట.
సెకండ్ ట్విట్టర్ అకౌంట్ స్టార్ట్ చేసినప్పటి నుండీ పవన్ అందులో తాజా సినిమాకి సంబంధించిన వివరాలను తెలియపరుస్తూ, ఫోటోలు కూడా పోస్ట్ చేయడం మొదలెట్టేశారు. పవన్ కళ్యాణ్‌లో ఇంతవరకూ చూడని కొత్త యాంగిల్ ఇది. 'పీకే క్రియేటివ్ వర్క్స్' పేరుతో ఈ ట్విట్టర్ అకౌంట్‌ని ఓపెన్ చేసి, క్రియేటివ్‌గా ఫోటోలకు పోజులిస్తూ పోస్ట్ చేస్తున్నారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారులే. మరో పక్క 'అజ్ఞాతవాసి' సినిమా కోసం కొత్త ముద్దుగుమ్మలైన అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ ఇద్దరూ తమ పాత్రకి తామే డబ్బింగ్ చెప్పేసుకున్నారు. ఆ విషయాన్ని తమ తమ ట్విట్టర్స్ ద్వారా పంచుకుంటూ, సినిమాకి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ అచ్చంగా 'అత్తారింటికి దారేది' సినిమా ఫ్లేవర్ బాగా కనిపిస్తోంది. ఇది అటుంచితే టైటిల్ లోగోతో కూడిని ఫస్ట్‌లుక్ కూడా ఇటీవలే విడుదలైంది. తీక్షణమైన చూపుల్తో, చేతిలో ఐడీ కార్డ్ తిప్పుతూ సూపర్ క్లాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు ఈ లుక్‌లో పవన్ కళ్యాణ్. 2018 జనవరి 10న 'అజ్ఞాతవాసి' ప్రేక్షకుల ముందుకు రానుంది.
No comments:
Post a Comment