Monday, 4 December 2017

రాజా మౌలి తరువాత మూవీ లో హీరోస్ గ రామ్ చరణ్ , ఎన్టీఆర్

రాజా మౌలి తరువాత మూవీ లో హీరోస్ గ రామ్ చరణ్ , ఎన్టీఆర్



బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళి చేయబోయే నెక్స్ట్‌ సినిమా ఏంటనే విషయంపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసినట్లే. ఈ మధ్య సోషల్‌ మీడియాలో రాజమౌళి ఓ ఫోటోని పోస్ట్‌ చేశాడు. మధ్యలో జక్కన్న అటూ ఇటూ చరణ్‌, ఎన్టీఆర్‌ ఉన్న ఫోటో అది. అప్పటి నుండీ గాసిప్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. జక్కన్న తీయబోయే తదుపరి చిత్రం ఓ మల్టీ స్టారర్‌ అని అయితే తేలిపోయింది. అది కూడా రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌తోనని కూడా తెలిసిపోయింది. అప్పటి నుండీ ఈ కాంబినేషన్‌పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

గతంలో చరణ్‌తో సెన్సేషనల్‌ మూవీ 'మగధీర'ను తెరకెక్కించాడు రాజమౌళి. అలాగే ఎన్టీఆర్‌తో 'యమదొంగ' తెరకెక్కించిన ధీరుడు కూడా రాజమౌళినే. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు పవర్‌ ఫుల్‌ ధీరులతో మల్టీ స్టారర్‌ అంటే అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయి. ఈ సినిమా టైటిల్‌, కథపై రకరకాల స్టోరీలు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి. ఈ సినిమాకి 'బ్రదర్స్‌' అనే టైటిల్‌ కూడా ప్రచారంలో ఉంది. అన్నదమ్ములు కాన్సెప్ట్‌లో ఈ సినిమా స్టోరీ ఉండబోతోందని తెలుస్తోంది. అంతేకాదు ఇద్దరు అన్నదమ్ములూ బాక్సర్స్‌గా నటిస్తారట అని అనుకుంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజముందో తెలీదు కానీ, రాజమౌళి క్లారిటీ ఇస్తేనే ఈ సస్పెన్స్‌ వీడేది. అంతేకాదు ఈ సినిమాకి అత్యంత భారీ బడ్జెట్‌ ప్లాన్‌ చేస్తున్నారనీ, అది 150 కోట్లు అంటూ కొంతమంది, కాదు కాదు 200 కోట్లు అంటూ మరికొంతమంది గాసిప్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఈ గాసిప్స్‌ ఆగాలంటే రాజమౌళి నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇదిలా ఉండగా, ఈ గాసిప్స్‌ ప్రచారం చూసి మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌, రామ్‌ చరణ్‌ తేజ్‌ని ఈ విషయమై చర్చించగా, ఈ గాసిప్‌ నిజమేనని చెప్పాడట. 'జవాన్‌' ప్రమోషన్స్‌లో భాగంగా తేజు ఈ విషయాన్ని కన్‌ఫామ్‌ చేయడంతో, చరణ్‌, ఎన్టీఆర్‌తో రాజమౌళి మల్టీ స్టారర్‌ పక్కా అని తేలిపోయింది. ఇక అఫీషియల్‌ ప్రకటన రావడమే ఆలస్యం.

No comments:

Post a Comment

Google bans crypto-currency adverts

Google bans crypto-currency adverts